బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొన్నం ప్రభాకర్

బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొన్నం ప్రభాకర్
  •  బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సన్మాన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్​ 

కరీంనగర్, వెలుగు: బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమితులై మొదటిసారి కరీంనగర్ కు వచ్చిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి నగర శివారులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు, మున్నూరు కాపు సంఘం నాయకులు స్వాగతం పలికి భారీ ర్యాలీగా డీసీసీ ఆఫీసుకు చేరుకున్నారు. 

అనంతరం ఇందిరా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం,  కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితరులు శ్రీరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తిని సన్మానించారు. 

జిల్లాలో 50 శాతం వడ్ల కొనుగోళ్లు పూర్తి

కరీంనగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో 50 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని, వచ్చే వారం లక్ష మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు టార్గెట్ విధించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇప్పటివరకు కొన్న వడ్లకు రైతులకు రూ.237 కోట్లు జమ చేశామని తెలిపారు. వడ్లు, మక్కల కొనుగోళ్లపై కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలంతో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం రివ్యూ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో 319 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.61 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తాయని అంచనా వేశామని, ఇప్పటివరకు 3.01లక్షల మెట్రిక్ టన్నులు రాగా  1.80 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. వారంలోనే రికార్డు స్థాయిలో 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. సమావేశంలో లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, సివిల్ సప్లై డీఎం రజనీకాంత్, రైస్ మిల్లులు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.