పీవీపై ప్రేమ ఉంటే వాణిదేవికి రాజ్యసభ సీటివ్వాలి

పీవీపై ప్రేమ ఉంటే వాణిదేవికి రాజ్యసభ సీటివ్వాలి

టీఆర్ఎస్ నేతలు వాణిదేవిని గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్.  పీవీని గౌరవిస్తూ అందరూ అభ్యర్థులు నామినేషన్ ఉప సంహరించుకోవాలన్న మంత్రి తలసానికి ఆయన కౌంటర్ ఇచ్చారు. గెలవలేని, బలం లేని స్థానంలో వాణిదేవికి అవకాశం ఇచ్చి పీవీని అవమానిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు నిజంగా పీవీ మీద ప్రేమ ఉంటే వాణిదేవికి రాజ్యసభ సీటివ్వాలని లేదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయాలని డిమాండ్ చేశారు పొన్నం.

కేసీఆర్ కుట్రలో పడి ఎన్నికల్లో పోటీచేయొద్దు..

చెట్టుపై చిటారు కొమ్మన చిరుత..