బండి సంజయ్ మంచి డ్రామా ఆర్టిస్ట్

బండి సంజయ్ మంచి డ్రామా ఆర్టిస్ట్

ప్రధాని మోడీ తర్వాత..బండి సంజయ్ మంచి ఆర్టిస్ట్ అని.. ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. అమిత్ షా డైరెక్షన్‌లో బండి సంజయ్ నటిస్తున్నాడన్నారు. బండి డ్రామా ..పోలీసుల ఓవర్ ఏక్షన్ ఎక్కువైపోయిందన్నారు. కేసీఆర్ ని జైలుకు పంపుతానన్న సంజయ్ జైలుకు పోయారని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ అవినీతిపై చర్యలు తీసుకోకుండా.. బీజేపీ ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. వరి కుప్పలపై రైతులు ప్రాణాలు వదిలినప్పుడు జేపీ నడ్డా ఎందుకు రాలేదని పొన్నం ప్రభాకర్ నిలదీశారు. కేసీఆర్‌ని జైలులో వేసిన తర్వాత బీజేపీ మాట్లాడాలని.. మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే రైతులు, వరి పంట సమస్యలు బయటకు రాకుండా బండి సంజయ్‌తో టీఆర్ఎస్ పార్టీ డ్రామా చేయిస్తోందన్నారు. 2018 ఎన్నికల్లో 105 సీట్లలో డిపాజిట్ రాని మీరు...ఇప్పుడు కూడా అదే దశలో ఉన్నారని అన్నారు పొన్నం. బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణ ప్రభుత్వం అవినీతిని బయటపెట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని  డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం.. 

రానున్న రోజుల్లో 90 శాతం ఒమిక్రాన్ కేసులు