చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం తర్వాత టాలీవుడ్‌కు దూరమైన పూజాహెగ్డే.. కొంత విరామం తర్వాత దుల్కర్ సల్మాన్ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ షూటింగ్ దశలో ఉండగానే తెలుగులో పూజాకు మరో క్రేజీ ఛాన్స్ లభించినట్టు సమాచారం. వెంకటేష్‌కు జంటగా ఆమె నటించబోతోందట.
ఇటీవల సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీ వెంకటేష్ హీరోగా చేయబోతున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో కార్తి, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్‌లలో ఒకరు ఇందులో కీలకపాత్ర పోషించబోతున్నట్టు ప్రచారంలో ఉంది. వెరైటీ టైటిల్‌తో రాబోయే ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజాహెగ్డేను ఖరారు చేసినట్టు వినిపిస్తోంది. ఇక వెంకటేష్‌తో కలిసి నటించడం పూజాకు ఇదే మొదటిసారి కాదు.
వెంకటేష్ ‘ఎఫ్ 3’లో స్పెషల్ సాంగ్ చేసిన ఆమె.. సల్మాన్ ఖాన్ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో వెంకటేష్ చెల్లెలుగా కనిపించింది. సో మూడోసారి వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఇక తమిళంలో విజయ్‌కు జంటగా ఆమె నటించిన ‘జననాయగన్’ రిలీజ్‌కు రెడీగా ఉండగా, ‘కాంచన 4’ షూటింగ్ దశలో ఉంది. హిందీలో వరుణ్ ధావన్‌తో ఓ సినిమా చేస్తోంది.
