Pooja Hegde: మహిళా ఫ్యాన్ మనసు దోచుకున్న పూజా హెగ్డే.. నడిరోడ్డు మీద ఏం చేసిందంటే?

Pooja Hegde: మహిళా ఫ్యాన్ మనసు దోచుకున్న పూజా హెగ్డే.. నడిరోడ్డు మీద ఏం చేసిందంటే?

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ అవుతుంది. ఓ పబ్లిక్ ప్లేస్‌లో పూజా హెగ్డే.. ఓ మహిళా అభిమానిపై చూపించిన ఆప్యాయత, ఓర్పు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. పూజా తన కారులోకి ఎక్కుతున్న సమయంలో, ఓ సాధారణ మహిళా అభిమాని వచ్చి సెల్ఫీ తీసుకోవాలని అనుకుంది. అయితే, ఆ అభిమాని వెంటనే సెల్ఫీ తీసుకునేంత ఖాళీగా లేదు. అప్పటికే ఏదో పనిఒత్తిడి మీద ఉండటంతో సెల్ఫీ తీసుకుని క్రమంలో కొంత గందరగోళానికి గురైంది.

అదే సమయంలోనే పూజాతో సెల్ఫీ తీసుకుంటుండగా మహిళకు ఫోన్ కాల్ వచ్చింది. ఇక ఆ వెంటనే ఏం చెయ్యాలో తోచక.. ఫోన్ లిఫ్ట్ చేసి ‘ఆగు మళ్లీ చేస్తా’ అంటూ కాల్ కట్ చేసింది. ఇదంతా గమనిస్తున్న పూజా మాత్రం ఎంతో ఓపికగా కారులోనే కూర్చొని.. చిరునవ్వుతో ఓపికగా ఎదురుచూసింది. అనంతరం అభిమానితో ప్రేమగా సెల్ఫీ దిగడమే కాకుండా, ఆమెకు “ధన్యవాదాలు” కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన అభిమానులు పూజా ప్రవర్తనను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు పూజా ప్రవర్తనను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. “ఇలాంటి సమయంలో చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. కానీ పూజా మాత్రం అభిమానిని గౌరవించి, ఓపికగా వేచి ఉండి సెల్ఫీ ఇచ్చింది. ఆమె నిజంగా ఎంతో వినయంగా ఉంటారు” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమా ప్రమోషన్లలో పూజా బిజీగా ఉంది. డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే హీరోయిన్స్గా నటించారు. ఈ బాలీవుడ్ రొమాంటిక్-కామెడీ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TIPS (@tips)

అలాగే, తమిళనాడు సీఎం విజయ్ నటించిన ‘జన నాయగన్’ లో పూజ నటిస్తోంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)