- నేను అధ్యక్షుడిగా లేకపోతే లియో పోప్ అయ్యేవాడే కాదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాథలిక్ క్రైస్తవుల గురువు పోప్ లియో మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇరాన్‌తో జరుపుతున్న యుద్ధాన్ని దైవ కార్యంగా ట్రంప్ అభివర్ణించడాన్ని పోప్ తప్పుబట్టగా.. పోప్‌పై ట్రంప్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. అల్జీరియా పర్యటనకు వెళ్తున్న క్రమంలో విమానంలో పోప్ లియో విలేకరులతో మాట్లాడుతూ.. ట్రంప్‌కు తాను భయపడటం లేదని తెలిపారు. కేవలం బైబిల్ సువార్త ప్రకారమే..శాంతి కోసం విజ్ఞప్తి చేస్తున్నానని స్పష్టం చేశారు.
‘ట్రంప్ ఇరాన్ యుద్ధాన్ని దైవ కార్యమని అంటున్నారు. మనుషులు తీసుకునే నిర్ణయాన్ని దేవుడికి, బైబిల్‌కు ముడిపెట్టడం తప్పు. బైబిల్ చెప్పే సువార్త శాంతి గురించి మాట్లాడుతుందేగాని.. బాంబులు వేయడం గురించి కాదు" అని పోప్ హెచ్చరించారు.
ఆయనొక రాడికల్ లిబరల్
పోప్ కామెంట్లకు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ పోస్ట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ఆయనొక రాడికల్ లిబరల్(అతివాద ఉదారవాది) అని మండిపడ్డారు. ఇరాన్ వంటి దేశాలు న్యూక్లియర్ వెపన్ కలిగి ఉండటాన్ని లియో సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది. నేను వైట్ హౌస్‌లో లేకపోతే లియో అసలు వాటికన్‌లోనే ఉండేవారు కాదు. ఆయన ఇకనైనా కామన్ సెన్స్‌తో ఆలోచించి మాట్లాడాలని పేర్కొన్నారు.

