బిట్‌కాయిన్ విలువ ఏడాదిలో 43 లక్షలు డౌన్‌

బిట్‌కాయిన్ విలువ ఏడాదిలో 43 లక్షలు డౌన్‌

న్యూఢిల్లీ: పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్‌‌కాయిన్ రెండేళ్లలో మొదటి సారిగా  16 వేల డాలర్ల (రూ.13 లక్షల) కు కిందకు వచ్చింది. ఏడాది క్రితం 69 వేల డాలర్ల (రూ. 56 లక్షల) దగ్గర ఆల్‌‌టైమ్ హైని టచ్‌‌ చేసిన ఈ కరెన్సీ, ఈ లెవెల్‌‌ నుంచి 75 శాతం పతనమైంది.  తాజాగా ఎఫ్‌‌టీఎక్స్‌‌, బినాన్స్ డీల్‌‌ ఆగిపోవడంతో క్రిప్టో మార్కెట్‌‌లో అనిశ్చితి నెలకొంది. బిట్‌‌కాయిన్‌‌, ఎథీరియం వంటి టాప్ కరెన్సీలతో పాటు మిగిలిన డిజిటల్ కరెన్సీల్లో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది.     ఈ సంఘటనకు ముందే క్రిప్టో మార్కెట్ వాల్యూ సుమారు 2 ట్రిలియన్ డాలర్లు తగ్గింది.  వివిధ దేశాల సెంట్రల్ బ్యాంక్‌‌లు వడ్డీ రేట్లను పెంచడంతో  వ్యవస్థలో లిక్విడిటీ పడిపోతోంది. క్రిప్టోలు నష్టపోవడానికి ఇదొక కారణం. 

ఎఫ్‌‌టీఎక్స్ డీల్‌‌..

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజిలయిన ఎఫ్‌‌టీఎక్స్‌‌, బినాన్స్‌‌లు తాజాగా క్రిప్టో మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. హాంకాంగ్ కంపెనీ అయిన ఎఫ్‌‌టీఎక్స్‌‌లో 20‌‌‌‌19 లో బినాన్స్‌‌ ఇన్వెస్ట్ చేసింది. అప్పుడు అతిపెద్ద డెరివేటివ్‌‌ కంపెనీగా  ఎఫ్‌‌టీఎక్స్‌‌ ఉండేది. ఆ తర్వాత బినాన్స్‌‌ కూడా తన డెరివేటివ్ సర్వీస్‌‌లను స్టార్ట్ చేసింది. తక్కువ టైమ్‌‌లోనే  ఈ సెగ్మెంట్‌‌లో లీడర్‌‌‌‌గా ఎదిగింది. రెగ్యులేటరీ సమస్యలను ఎదుర్కొంటున్న రెండు కంపెనీలూ ఇతర క్రిప్టో ఎక్స్చేంజిలను కొనడానికి గతంలో  పోటీ పడ్డాయి. తాజాగా ఎఫ్‌‌టీఎక్స్‌‌ మొత్తాన్ని టేకోవర్ చేయడానికి బినాన్స్‌‌ డీల్ కుదుర్చుకుంది. కానీ, ఫైనాన్షియల్‌‌గా  ఎఫ్‌‌టీఎక్స్ అధ్వాన్నంగా ఉందని, ఈ కంపెనీపై  రెగ్యులేటరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా జరుగుతున్నాయని కారణం చూపి ఈ డీల్‌‌ నుంచి బినాన్స్ తప్పుకుంది. ఎనలిస్టుల అంచనాల ప్రకారం ఎఫ్‌‌టీఎక్స్‌‌కు 6 బిలియన్ డాలర్ల అప్పులు ఉన్నాయి.  దీంతో ఎఫ్‌‌టీఎక్స్ దివాలా అవుతుందనే అంచనాలు క్రిప్టో వరల్డ్‌‌ను కుదిపేస్తున్నాయి.    ఎఫ్‌‌టీఎక్స్ డీల్ ఆగిపోవడంతో క్రిప్టో మార్కెట్ క్యాప్‌‌  180 బిలియన్  డాలర్లు తగ్గిందని  బైయూకాయిన్‌‌ సీఈఓ  శివం తక్రల్ అన్నారు. మాటిక్‌‌, అవాక్స్‌‌, సోల్‌‌ వంటి ఆల్ట్‌‌కాయిన్స్ భారీగా పడ్డాయని, మిగిలిన క్రిప్టో కరెన్సీలు నష్టపోయాయని పేర్కొన్నారు. ఎఫ్‌‌టీఎక్స్‌‌  నుంచి రిటైల్‌‌, ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ ఫండ్స్‌‌ను విత్‌‌డ్రా తీసుకోవడంపై క్లారిటీ వచ్చేంత వరకు క్రిప్టో మార్కెట్‌‌ తిరిగి లేవదని చెప్పారు. ఎఫ్‌‌టీఎక్స్ డీల్ ఆగిపోవడంతో పాటు, గ్లోబల్‌‌ అంశాల కారణంగా క్రిప్టో మార్కెట్‌‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొందని ఐఎఫ్‌‌ఏ గ్లోబల్‌‌ ఓ నోట్‌‌లో పేర్కొంది. ‘ఎఫ్‌‌టీఎక్స్‌‌ను టేకోవర్‌‌‌‌ చేయడం నుంచి  బినాన్స్ వెనక్కి తగ్గింది. 8 బిలియన్ డాలర్ల ఫండ్స్ లేకపోతే ఎఫ్‌‌టీఎక్స్ దివాలా తీస్తుంది. మరోవైపు యూఎస్ మిడ్‌‌టర్మ్ ఎలక్షన్స్‌‌లో రిపబ్లికన్ల పెర్ఫార్మెన్స్‌‌ అంచనాలకు తగ్గట్టు లేకపోవడం కూడా క్రిప్టో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌‌ను దెబ్బతీస్తోంది’ అని వివరించింది.  మరోవైపు వెంచర్ క్యాపిటలిస్ట్ సెకోవియా ఎఫ్‌‌టీఎక్స్‌‌లోని   మొత్తం ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ను  తమ బుక్స్‌‌ నుంచి వ్రైట్ డౌన్‌‌ (తగ్గించేయడం) చేసింది.  కిందటేడాది ఈ కంపెనీలో 214 మిలియన్ డాలర్లను సెకోవియా ఇన్వెస్ట్ చేసింది.

అన్ని క్రిప్టోలు నష్టాల్లోనే..

బిట్‌కాయిన్ గురువారం ఇంట్రాడే సెషన్‌లో 15,799 డాలర్లకు పడిపోయింది.  తిరిగి రికవరీ అయ్యి 16,600 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.  ఎథీరియం  1,090 డాలర్లకు పడిపోగా, కొంత నష్టాలను తగ్గించుకొని  1,215 వద్ద ట్రేడవుతోంది.  కార్డానో,  డోజికాయిన్‌, షిబా ఇను, అవలాంచ్‌ కరెన్సీలు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  సోలాన గురువారం 21 శాతం క్రాష్ అవ్వగా, ఎఫ్‌టీఎక్స్‌ విడుదల చేసిన ఎఫ్‌టీఎక్స్ టోకెన్   35 శాతం పతనమయ్యింది.