అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టు పెడితే చితకబాదారు

అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టు పెడితే చితకబాదారు

సోషల్ మీడియాలో నచ్చిందల్లా.. లైక్‌‌లు కొట్టడం, కామెంట్స్, షేర్ చేయడం చేస్తుంటారు. అంతేగాకుండా పోస్టులు పెడుతుంటారు. ఇందులో రాజకీయపరంగా కూడా ఉంటాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్న ఘటనలు తెలిసే ఉంటాయి. తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు గాను.. తనను పోలీసులు చితకబాదారంటూ.. ఆరోపణలు గుప్పించాడో ఓ యువకుడు. 

లాఠీలతో ఇష్టం వచ్చినట్లు కొట్టారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నడవలేని పరిస్థితిలో కాళ్ళకి గాయాలయ్యాయని ఇతరులు చెప్పారు. మోచేతిపై వీపుపై తనను కొట్టారన్నారు. కొట్టాలని ఏ ఉన్నతాధికారి చెప్పారో వారి పేరు తమకు కావాల్సిందేనన్నారు. ఈ విషయంలో తాము సీఐను కలుస్తామని తెలిపారు. ఎమ్మెల్యేను ఉద్దేశించి పవన్ పోస్ట్ పెట్టాడంటూ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ పై సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తమకు కోపం తెప్పించిందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. 

ఈ ఘటనలో పోలీసు అధికారి మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం. ఓ ఫంక్షన్ ఏర్పాటు చేయగా.. టీఆర్ఎస్ మండల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. కలిసి భోజనం చేస్తుండగా.. ఓ ఫొటోను తొంటి పవన్ కుమార్ అనే వ్యక్తి వాట్సాప్ లో షేర్ చేస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశాడన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశాడని, ఒప్పుకోవడంతో పవన్ కుమార్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. తదుపరి విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

ఘటనపై పవన్ కుమార్ మీడియాతో మాట్లాడాడు. తనను మందలిస్తారని అనుకున్నట్లు, కానీ ఇలా చేస్తారని అనుకోలేదన్నారు. సార్ ను ఉద్దేశించి పెట్టలేదని మరోసారి చెప్పాడు. కొడుతున్నప్పుడు.. సీపీకి అప్పచెబుతానని.. మీరు తీసుకరమ్మన్నారు.. తీసుకొచ్చినట్లు అవతలి వారికి చెప్పారన్నారు. సాయంత్రం ఫిర్యాదు చేస్తే.. తనను ఉదయమే కొట్టారని పవన్ ఆవేదన వ్యక్తం చేశాడు.