- ముమ్మాటికీ పోలీసుల నిర్లక్ష్యమే: బాధితులు
ఉప్పల్/ఘట్కేసర్, వెలుగు: ఉప్పల్‌లో ఆదివారం జరిగిన ఐపీఎల్మ్యాచ్కారణంగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడి అంబులెన్స్గంటల పాటు నిలిచిపోయి ఓ బాలింత మృతి చెందిందన్న వార్తను స్థానిక ట్రాఫిక్ పోలీసులు ఖండించారు. బిష్ణ అనే బాలింత మృతికి సంబంధించి తమ తప్పు లేదన్నారు. మ్యాచ్జరిగిన రోజు అంబులెన్స్సాయంత్రం 6:30 గంటలకు బీబీనగర్ఎయిమ్స్ వద్ద స్టార్టయ్యి రాత్రి 7:28కి ఉప్పల్ఎక్స్రోడ్స్ కు వచ్చిందన్నారు.
డ్యూటీలో ఉన్న సిబ్బంది సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్లో అంబులెన్స్‌ను గమనించి ఉప్పల్వైపు వెళ్లే దారిలో రాంగ్రూట్లో పంపగా 7:49 వరకే ఏక్మినార్జంక్షన్దాటి వెళ్లిపోయిందన్నారు. అయితే, బాధిత కుటుంబం మాత్రం ఉప్పల్ట్రాఫిక్జామ్లో గంటల పాటు ఇరుక్కుపోవడంతోనే బిష్ణ ప్రాణాలు కోల్పోయిందని, దీనికి ముమ్మాటికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.
