నీళ్లను కూడా వదలర్రా..? హైదరాబాద్ లో బ్రాండెడ్ బాటిళ్లలో కల్తీ నీళ్లు..!

నీళ్లను కూడా వదలర్రా..? హైదరాబాద్ లో బ్రాండెడ్ బాటిళ్లలో కల్తీ నీళ్లు..!

ఎండలు మండిపోతున్నాయి... నీళ్లు ఎక్కువ తాగండి.. డిహైడ్రేట్ అవ్వకుండా ఉండండి అని తరచూ వింటుంటాం. అయితే.. హైదరాబాద్ లో నీళ్లు తాగినా ఆరోగ్యం పాడయ్యేలా మారింది పరిస్థితి. నిన్నా, మొన్నా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి విన్నాం, కల్తీ పాల గురించి... ఇప్పుడు కల్తీ నీళ్ల బాగోతం బయటపడింది. హైదరాబాద్ లో కల్తీ రాయుళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కల్తీ రాయుళ్లు ఇంతకు తెగించారంటే మంచి నీళ్లను కూడా వదలకుండా  కల్తీ చేసేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో కల్తీ నీళ్లు తయారు చేస్తున్న గోదాంపై దాడి చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

పాత బస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుల్ బాగ్ చమన్ లో  కల్తీ నీరు తయారు చేస్తున్న భవాని  ఎంటర్ ప్రైజెస్ గోదాం పై చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులుదాడి చేశారు. లోకల్ కంపెనీ పేరు పెట్టి సరైన పద్ధతి లో ఫిల్టర్ చేయకుండా షాప్స్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు.

►ALSO READ | అప్పు చెల్లించాలని.. అంగన్వాడీ టీచర్ ను చెట్టుకు కట్టేసిన ఫైనాన్సర్లు 

నీళ్లు చాలారోజులు కలుషితం కాకుండా కెమికల్స్ కలుపుతున్నటు గుర్తించారు అధికారులు. ఈ తనిఖీల్లో 173 వాటర్ ప్యాకెట్ బస్తాలు,  సీజ్ చేసినట్టు  అధికారులు తెలిపారు. చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు.