అప్పు చెల్లించాలని.. అంగన్వాడీ టీచర్ ను చెట్టుకు కట్టేసిన ఫైనాన్సర్లు 

అప్పు చెల్లించాలని.. అంగన్వాడీ టీచర్ ను చెట్టుకు కట్టేసిన ఫైనాన్సర్లు 

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది... తీసుకున్న అప్పు చెల్లించలేదని అంగన్వాడీ టీచర్ ను చెట్టుకు కట్టేసి అవమానించారు ఫైనాన్సర్లు. బుధవారం ( ఏప్రిల్ 8 ) వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్న ఓ మహిళను దారుణంగా అవమానించారు ఫైనాన్సర్లు. తీసుకున్న అప్పు చెల్లించలేదని చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేసారు.

సుమారు గంట పాటు చెట్టుకు కట్టేసి అప్పు చెల్లించాలంటూ మహిళను హింసించారు నీచులు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

►ALSO READ | వికారాబాద్ వృద్ధురాలి హత్య కేసులో షాకింగ్ విషయాలు 

అప్పు తీసుకున్న పాపానికి.. మహిళ అని కూడా చూడకుండా చెట్టుకు కట్టేసి అవమానించారని... ఫైనాన్సర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది బాధితురాలు.