హార్మూజ్ రీఓపెన్.. బ్యారెల్‌కు ఒక డాలర్ కట్టాలన్న ఇరాన్.. పేమెంట్ క్రిప్టో కరెన్సీలో చేయాలని డిమాండ్ !

హార్మూజ్ రీఓపెన్.. బ్యారెల్‌కు ఒక డాలర్ కట్టాలన్న ఇరాన్.. పేమెంట్ క్రిప్టో కరెన్సీలో చేయాలని డిమాండ్ !

ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హార్మూజ్ జలసంధి మీదుగా చమురు నౌకలు వెళుతున్నాయి. కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. హార్మూజ్ తిరిగి అందుబాటులోకి వచ్చాక.. రెండు నౌకలు ఈ జలసంధి మీదుగా వెళ్లాయని సముద్ర పర్యవేక్షణ సంస్థ మెరైన్ ట్రాఫిక్ బుధవారం తెలిపింది. గ్రీస్కు చెందిన బల్క్ క్యారియర్ NJ ఎర్త్ UTCకి జలసంధిని దాటగా, పశ్చిమాఫ్రికా దేశమైన లైబీరియా జెండా ఉన్న నౌక హార్మూజ్ మీదుగా ప్రయాణించడం గమనార్హం.

అయితే.. ఇరాన్ తాజాగా సరికొత్త ప్రతిపాదన తెర మీదకు తెచ్చింది. హోర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే చమురు ట్యాంకర్లపై బ్యారెల్‌కు 1 డాలర్ చెల్లించాలని, చెల్లింపును క్రిప్టో కరెన్సీలో చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది.  ఇరాన్ ఆయిల్, గ్యాస్, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధి హమీద్ హొస్సేని మాట్లాడుతూ.. హార్మూజ్ మీదుగా వెళ్లే ప్రతి ఆయిల్ ట్యాంకర్ నుంచి టోల్ ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ భావిస్తున్నట్లు తెలిపారు.

►ALSO READ | సీజ్ ఫైర్ లేదు.. తొక్క లేదు.. మిస్సైల్స్తో లెబనాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ !