ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో పేదరికం గత ఆరు సంవత్సరాల్లో గణనీయంగా పెరిగింది. ఆ దేశ జనాభాలో సుమారు 28.8 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. పాకిస్తాన్‌లో పేదరిక అంచనాలపై అధ్యయనం చేసిన ప్రభుత్వ కమిటీ ఈ విషయాన్ని తేల్చింది.
పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ (పీఐడీఈ) మాజీ జాయింట్ డైరెక్టర్ జీఎం ఆరిఫ్ నాయకత్వంలో ఈ అధ్యయనం కొనసాగింది. ఈ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదు. అయితే, స్థానిక మీడియా కథనాల ప్రకారం.. 2018–19లో పేదరికం 21.9 శాతంగా ఉండగా, 2024–25 నాటికి అది 28.8 శాతానికి చేరింది.
అంటే సుమారు 6.9% పెరుగుదల నమోదైంది. గత ఆరేండ్లలో మూడుసార్లు దేశంలో ఐఎంఎఫ్ రూల్స్ అమలు చేయడం, కరోనా ఎఫెక్ట్, ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ జీడీపీ వృద్ధి రేట్లు, రెండు భారీ వరదలు, గోధుమలకు మద్దతు ధరల రద్దు.. వంటి అంశాలు పేదరికం పెరగడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
