శివపార్వతులుగా ప్రభాస్, నయనతార.. కన్నప్ప కోసం 16 ఏళ్ళ తరువాత

శివపార్వతులుగా ప్రభాస్, నయనతార.. కన్నప్ప కోసం 16 ఏళ్ళ తరువాత

మంచు వారి హీరో విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప(Kannappa). దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా  ఈ మధ్యే శ్రీకాళహస్తిలో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇక ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్(Mukhesh kumar singh) తెరకెక్కిస్తుండగా.. నురూప్ సనన్(Nurup sanon) హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలేదని సమాచారం. 

అయితే కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర చాలా కీలకం. అందుకే ఈ సినిమాలో ఆ పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను తీసుకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని మంచు విష్ణు ఇండైరెక్ట్ గా రివీల్ చేశారు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు శివుడి పక్కన పార్వతిగా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందో. శివపార్వతులుగా ప్రభాస్, నయనతారను ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్. 

ఈ వార్త గనుక నిజమైతే.. కన్నప్ప సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలువడం ఖాయం అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.