Prabhas: అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ‘ఫౌజీ’ యూనిట్కి కారు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురు గాయాలు!

Prabhas: అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ‘ఫౌజీ’ యూనిట్కి కారు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురు గాయాలు!

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫౌజీ’(Fauzi). హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం  రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం (ఏప్రిల్ 5, 2026న) సినిమా షూటింగ్‌కు వెళ్తున్న ప్రొడక్షన్ యూనిట్‌కు చెందిన కారు ప్రమాదానికి గురైంది.

నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ను ఢీకొట్టిన కారు, అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిలిం సిటీకు వెళ్లే మార్గంలో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రొడక్షన్ యూనిట్‌కు చెందిన రామరాజు తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకోగా, అనంతరం మృతి చెందినట్లు సమాచారం.

గాయపడిన మరో ఐదుగురికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ టీమ్‌కు ఈ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.