
తనను సీఎంను చేస్తే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని స్వర్గంలా మారుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసీఆర్ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అర్హలైన అందరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేయలేని ప్రభుత్వం.. మళ్లి ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసి అన్ని ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తనకు మద్దతుగా ఉండాలని కోరారు. సికింద్రాబాద్ తుకారాం గేట్ లోని మాంగర్ బస్తీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తానని ప్రజలు తనని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో పిల్లలకు ఛాక్లెట్లు పంచిపెట్టారు.