
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావుఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం ప్రజావాణికి 1,203 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. గురుకుల నియామకాల్లో అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమ సమస్య పరిష్కరించాలంటూ ప్రజాభవన్ ఆవరణలో బైఠాయించారు.
ఆందోళన చేయాలనుకుంటే సంబంధిత కార్యాలయం వద్ద చేసుకోవాలని పోలీసులు పంపించారు. రేషన్‌కార్డులు, ఇండ్లు, పింఛన్లు ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.