ప్రణబ్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు

ప్రణబ్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు

ప్రకటనలో ఆస్పత్రి వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఆస్పత్రి వర్గాలు వెల్డడించాయి. ‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెల్త్ కండీషన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన చికిత్స అందిస్తున్నాం. ఆయనను వెంటిలేటర్‌‌ సపోర్ట్‌పై ఉంచి ట్రీట్‌మెంట్ చేస్తున్నాం’ అని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ మెడికల్ బులెటిన్‌లో సోమవారం తెలిపింది.