
సుహ్ల్ (జర్మనీ): ఇండియా టీనేజ్ షూటర్ నరేన్ ప్రణవ్.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ప్రణవ్ 227.9 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచాడు. చైనాకు చెందిన హువాంగ్ లివాన్లిన్ (250.3) స్వర్ణం నెగ్గగా, అమెరికా షూటర్ బ్రాడెన్ పీజర్ (250.0) రజతం సాధించాడు.
తొలి ఐదు షాట్ల సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న ప్రణవ్ రెండో రౌండ్‌లో వెనకబడ్డాడు. సింగిల్ షాట్స్ ప్రారంభంలో ప్రణవ్ నాలుగో స్థానానికి పడిపోయాడు. కానీ ఎలిమినేషన్ రౌండ్‌కు వచ్చేసరికి మూడో ప్లేస్‌లోకి వచ్చి పతకం సొంతం చేసుకున్నాడు. క్వాలిఫయింగ్‌లో ప్రణవ్ 632.1 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు.