ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. డీఎస్పీ నుంచి సీఐగా ప్రణీత్ రావు డిమోట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. డీఎస్పీ నుంచి సీఐగా ప్రణీత్ రావు డిమోట్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేళ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావును ప్రభుత్వం డిమోట్ చేసింది. డీఎస్పీ నుంచి సీఐగా డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2007 బ్యాచ్‎కు చెందిన ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుకు ముందు డీఎస్పీ హోదాలో ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయ్యాక ఆయన సస్పెండ్ అయ్యారు. అక్జిలరీ ప్రమోషన్ పొందిన డీఎస్పీని మొదటిసారి ఇన్స్పెక్టర్‎గా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాల ఫోన్లను ట్యాప్ చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించారు. అలాగే.. ఫోన్ ట్యాపింగ్‎కు సంబంధించిన ఆధారాలు దొరక్కుండా ఎస్‌‌‌‌ఐబీ లాగర్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌లో పక్కా ప్లాన్‌‌‌‌తో హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు ధ్వంసం చేసినట్లు ప్రణీవ్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ప్రణీవ్ రావును అరెస్ట్ చేశారు. కొన్ని నెలలు జైల్లో ఉన్న తర్వాత ఆయన బెయిల్‎పై విడుదల అయ్యారు.