పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి ప్రణీత

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి ప్రణీత

ప్రముఖ నటి ప్రణీత సుభాస్ పండంటి బిడ్డకి జన్మినిచ్చింది. పొత్తిళ్లల్లో పసిబిడ్డను పట్టుకొని అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని స్వయానా ఆమే వెల్లడించింది. చిన్నారిని ఎత్తుకొని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఓ భావోద్వేగమైన నోట్ ను కూడా షేర్ చేసింది. "మా అమ్మ గైనకాలజిస్టు కావడం నా అదృష్టం. ఆమెకు అపార అనుభవమున్నా.. నా ప్రసవం సమయంలో చాలా ఎమోషనల్ అయింది. డెలివరీ తేలికగా అయ్యేలా చేసిన డా.సునీల్ ఈశ్వర్, డా.సుబ్బు, వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విషయాన్ని పంచుకోలేకుండా ఉండలేకపోతున్నానంటూ" ఆమె తల్లి, డాక్టర్లతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది ప్రణీత. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా ప్రణీత సమాధానమిచ్చింది. మీది నార్మల్ డెలివరీనా అని అడగగా.. దానికి ఆమె.. అవును నార్మల్ డెలివరీనే.. పన్నెండు గంటల ప్రసవ వేదనను అనుభవించానంటూ రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉండగా గతేడాది మేలో వ్యాపారవేత్త అయిన నితిన్ రాజుతో ప్రణీత వివాహం జరిగిన విషయం తెలిసిందే.