హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) అర్బన్ ఫారెస్ట్రీ నూతన డైరెక్టర్‌గా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ స్పెషల్కమిషనర్ఎస్వి. ప్రసాద్‌కుమార్ శెట్టి నియమితులయ్యారు.
ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ గా ఉన్న డా. బి. ప్రభాకర్ బదిలీ అయ్యారు. ఆయనను ప్రిన్సిపల్ చీఫ్కన్జర్వేటర్ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.
