- గాంధీ భితిహర్వా ఆశ్రమంలో మౌన వ్రతాన్ని చేపట్టిన జన్ సురాజ్ చీఫ్
పాట్నా: బిహార్‌లో ఒకవైపు ఎన్డీయే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుండగా, మరోవైపు జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ మౌన దీక్ష చేపట్టారు. గురువారం చంపారన్ జిల్లాలోని గాంధీ భితిహర్వా ఆశ్రమంలో ఆయన ఒకరోజు మౌన నిరాహార దీక్ష చేపట్టారు.
అంతకుముందు రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీక్ష గురించి ప్రకటన చేశారు. ‘‘గత మూడేండ్లుగా నేను పనిచేయడం మీరు చూశారు. ఇకపై దానికంటే రెండింతలు ఎక్కువగా కష్టపడి పనిచేస్తాను. నా శక్తినంతా ధారపోస్తాను. వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. బిహార్‌ను అభివృద్ధి చేయాలనే నా సంకల్పాన్ని నెరవేర్చుకునే వరకు వెనక్కి తగ్గేది లేదు.
రాష్ట్ర ప్రజలు దేని ఆధారంగా ఓటు వేయాలనే విషయాలను వారికి వివరించడంలో ఫెయిల్ అయ్యాను. దానికి ప్రాయశ్చిత్తంగా మౌన దీక్ష చేపడతాను. మనం తప్పులు చేసి ఉండొచ్చు.. కానీ నేరాలు చేయలేదు”అని ఆయన పేర్కొన్నారు.
