- నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించిన ప్రవీణ్ సూద్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో బుధవారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటించారు. నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించిన అనంతరం కోఠిలోని సీబీఐ జోనల్ ఆఫీస్‌కు చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ డైరెక్టర్‌తో కలిసి పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ, ఏపీకి సంబంధించిన సీబీఐ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై ఆరా తీశారు.
దర్యాప్తులో ఉన్న కీలక కేసులతో పాటు విచారణ, కేంద్ర అనుమతి కోసం పెండింగ్‌లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసు వివరాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.
దీంతోపాటు వామనరావు దంపతుల హత్య కేసు కూడా ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో ఉంది. ఈ నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఆకస్మికంగా హైదరాబాద్‌లో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది.
