కేసీఆర్ పాలన పోవాలని మొక్కుకున్నా

కేసీఆర్ పాలన పోవాలని మొక్కుకున్నా

జగద్గిరిగుట్ట మినీ మేడారం జాతరకు హాజరైన జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి

జగద్గిరిగుట్ట: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని సమ్మక్క సారలమ్మలను మొక్కుకున్నానని తెలిపారు జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. శనివారం జగద్గిరిగుట్ట మినీ మేడారం జాతరకు ముఖ్య అతిథిగా హాజరైన వివేక్.. సమ్మక్క, సారలమ్మల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో పడి నలిగిపోతుందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే కేసీఆర్ ను గద్దె దించాలని కోరారు. ఓ వైపు ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగ యువత బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. కేసీఆర్ మాత్రం తన బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1 లక్షా 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని తాగుబోతులకు అడ్డాగా మార్చిన కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. 

మరికొన్ని వార్తల కోసం:

ప్రభాస్ తో నటించడం నాకు దక్కిన గౌరవం