ప్రభాస్తో నటించడం నాకు దక్కిన గౌరవం

ప్రభాస్తో  నటించడం నాకు దక్కిన గౌరవం

బాహుబలి ఫేం ప్రభాస్ తో నటించడం నాకు దక్కిన గౌరవం అంటూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ను తెగపొగిడేశాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ స్టార్టయింది. ఈ సినిమాకు ‘ప్రాజెక్ట్ కే ’ అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేసింది చిత్ర బృందం. కాగా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో అమితాబ్ నటిస్తున్నాడు. షూటింగ్ లో పాల్గొన్న అమితాబ్.. తన అనుభవాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘ఫస్ట్ డే... ఫస్ట్ షాట్... ఫస్ట్ ఫిల్మ్ విత్ ది బాహుబలి ప్రభాస్. పెద్దల పట్ల ప్రభాస్ వినయం, పని పట్ల అతని అంకితభావం, నటనలో అతడి ప్రతిభాపాటవాలు నన్ను కట్టిపడేశాయి. అలాంటి వ్యక్తితో నటించడం నిజంగా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’ అంటూ కామెంట్ చేశాడు బిగ్ బి.