రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇవాళ అసెంబ్లీలో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ ప్రజెంటేషన్​

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇవాళ అసెంబ్లీలో  పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ ప్రజెంటేషన్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం అసెంబ్లీ హాల్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక స్క్రీన్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు వీలుగా క్వశ్చన్‌‌‌‌‌‌‌‌ అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేస్తూ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశమవగానే ఇటీవల మృతి చెందిన మాజీ సభ్యులు రామన్నగారి శ్రీనివాస్ రెడ్డి (రామాయంపేట), కొప్పుల హరీశ్వర్ రెడ్డి (పరిగి), కుంజ సత్యవతి (భద్రాచలం)కి సంతాపం ప్రకటిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేస్తారని, దానిపై షార్ట్ డిస్కషన్ ఉంటుందని అసెంబ్లీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో తీసుకున్న అప్పులు, చేపట్టిన ఇరిగేషన్, పవర్ ప్రాజెక్టులు, వాటి కోసం చేసిన ఖర్చు, వాటితో చేకూరిన లబ్ధి, ఆయా ప్రాజెక్టుల కోసం తెచ్చిన అప్పులు, వాటి రీ పేమెంట్లతో ఏటా రాష్ట్ర ఖజానాపై పడే భారం ప్రజలకు ప్రభుత్వం వివరించనుంది. ఈ క్రమంలోనే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌‌‌‌‌‌‌‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్టేట్ ఫైనాన్స్ స్టేటస్‌‌‌‌‌‌‌‌పై ఇచ్చే పీపీటీపై ఆయనతో చర్చించారు. ఆయన సూచనల మేరకు ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌ రూపొందించారు. ఇరిగేషన్, పవర్​సెక్టార్లకు సంబంధించిన పలువురు నిపుణులతో సమావేశమై పీపీటీలు రెడీ చేశారు. 

గురువారం ఇరిగేషన్, పవర్​సెక్టార్లపై శ్వేతపత్రం విడుదల చేసి, పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ఇచ్చే అవకాశముందని ప్రభుత్వవర్గాలు చెబున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి చేసిన అప్పులతో పాటు ఇరిగేషన్, పవర్ సహా ఇతర శాఖలకు సంబంధించిన కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు, వాటికి చెల్లిస్తోన్న వడ్డీ, ఆ అప్పులు ఎందుకు ఖర్చు చేశారు అనే వివరాలను సీఎం రేవంత్​రెడ్డి తన ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌లో వివరించనున్నారు. 

పీపీటీకి మాకు అవకావమివ్వండి: స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బీఆర్ఎస్ విజ్ఞప్తి

అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తమకూ అవకాశం ఇవ్వాలనిస్పీకర్ ప్రసాద్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బీఆర్ఎస్ లెజిస్లేటివ్పార్టీ విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్యే హరీశ్ రావుబీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్పీ తరఫున రాసిన లేఖను మంగళవారం స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. పీపీటీ ఇచ్చేందుకు ప్రభుత్వానికి అనుమతిస్తే.. ప్రధాన ప్రతిపక్షంగా దీనిపై తమ పార్టీ వెర్షన్ చెప్పాల్సి ఉంటుందని, అందుకోసం తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకుఅనుమతివ్వాలని ఆయన కోరారు.

స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ..

తెలంగాణ అసెంబ్లీలో 2016 మార్చి 31న ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌పై అప్పటి సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌ను బహిష్కరించింది. కాగా, ఇప్పుడు అధికార పక్షానికి పీపీటీకి చాన్స్ ఇస్తే తమకూ అవకాశం ఇవ్వాలని ఇప్పటికే బీఆర్ఎస్ శాసనసభ పక్షం స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరింది. దీంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సభలో శ్వేత పత్రం ప్రవేశపెట్టిన తర్వాత దానిపై చర్చ ఉంటుంది.. కాబట్టి ప్రతిపక్షం ఏమైనా చెప్పుకోవాలంటే వారికి ఇచ్చిన టైంలోనే చెప్పుకోవాలని సూచిస్తూ పీపీటీ విజ్ఞప్తిని తిరస్కరిస్తారా.. అధికార పక్షంతో పాటు వారికి చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ఇచ్చే శ్వేతపత్రం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌ను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఆ పార్టీ తరఫున మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు చర్చలో పాల్గొననున్నారు. మరోవైపు, సభ సజావుగా నిర్వహించేందుకు స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించేందుకు మార్షల్స్‌‌‌‌‌‌‌‌ సిద్ధం చేస్తున్నారు.