
పద్మారావునగర్, వెలుగు: మొక్కలు నాటడం ద్వారానే గ్లోబల్ వార్మింగ్‌ను నివారించగలుగుతామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వాణి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా- 2025లో భాగంగా సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. సూపరింటెండెంట్ మెయిన్ బిల్డింగ్ అవరణలో పలు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంవో- 1 డాక్టర్ శేషాద్రి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మహేశ్, సెక్యూరిటీ చీఫ్ శివాజీ, పవర్ గ్రిడ్ సిబ్బంది పాల్గొన్నారు.