పండ్లు, కూరగాయల దిగుబడి డౌన్‌‌‌‌

పండ్లు, కూరగాయల  దిగుబడి డౌన్‌‌‌‌

న్యూఢిల్లీ: దేశంలో కూరగాయలు, పండ్ల ధరలు  పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్స్‌‌‌‌‌‌‌‌ వలన వీటి ప్రొడక్షన్ 3‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 శాతం వరకు  పడిపోనుందని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు చెబుతున్నారు.  పూత పూయడం, పండ్లవ్వడంలో ఈసారి భారీ డ్యామేజ్ చూశామని  రైతులు చెబుతున్నారు. రానున్న సీజన్‌‌‌‌‌‌‌‌లో  మామిడి పండ్ల ప్రొడక్షన్ భారీగా తగ్గుతుందని అంటున్నారు. హీట్‌‌‌‌‌‌‌‌వేవ్స్‌‌‌‌‌‌‌‌ ఈసారి తొందరగా రావడమే దీనికి కారణమని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు పేర్కొన్నారు.  మామిడితో పాటు లీచీ, బత్తాయి, వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిలన్‌‌‌‌‌‌‌‌, అరటి, జీడి వంటి పండ్ల ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ ఈసారి తగ్గనుందని వివరించారు. క్యాబేజి, కాలీఫ్లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆకుకూరలు, టమోట ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌  కూడా తగ్గుతుందని,  అంతేకాకుండా వీటి  న్యూట్రిషనల్ కంటెంట్ కూడా పడిపోతుందని వివరించారు. 

ఈసారి వివిధ రకాల కూరగాయలు, పండ్ల ప్రొడక్షన్ 10–30 శాతం మేర పడిపోతుందని ఇండియన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ (ఐఐహెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), బెంగళూరు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఎస్‌‌‌‌‌‌‌‌కే సింగ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. సడెన్‌‌‌‌‌‌‌‌గా టెంపరేచర్స్‌‌‌‌‌‌‌‌ పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. ఆల్ఫన్సో రకం మామిడి ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ మహారాష్ట్రలో 40 శాతం మేర పడిపోతుందని పేర్కొన్నారు.  వేడి గాలులు పెరగడంతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువవ్వడంతో   పంటలపై ఫంగస్, పెస్ట్‌‌‌‌‌‌‌‌ దాడులు పెరిగాయని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు చెబుతున్నారు. సాధారణంగా టెంపరేచర్స్‌‌‌‌‌‌‌‌ నెమ్మదిగా  హోలి నుంచి పెరుగుతాయి. ఈ ఏడాది మార్చి 8 న హోలి ఉంది. కానీ, ఈసారి టెంపరేచర్స్‌‌‌‌‌‌‌‌ వింటర్  ముగిసిన వెంటనే పెరిగిపోయాయి. కిందటి నెల హాటెస్ట్ ఫిబ్రవరిగా నిలిచింది. టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సగటున 29.5 డిగ్రీల సెల్సియస్‌‌‌‌‌‌‌‌గా  రికార్డయ్యింది. 

క్వాలిటీ తగ్గుద్ది..


రాత్రిపూట  టెంపరేచర్స్ సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని ఏఐ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రాపిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్ పంకజా క్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.  పగటి, రాత్రి పూట టెంపరే చర్ల మధ్య గ్యాప్ దిగొస్తోందని పేర్కొ న్నారు. ఫలితంగా వేడి నుంచి రికవరీ అవ్వడానికి  పంటలకు అవకాశం లేకుండా పోతోందని వివరించారు. కూరగాయల సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా అంతరాయాలు ఏర్పడుతున్నాయని, కొన్ని సార్లు కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉంటోందని, మరికొన్ని టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కొరత వస్తోందని  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్టులు చెబుతున్నారు. ఫలితంగా ఫుడ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్  పెరగొచ్చని చెప్పారు.  కొన్ని ప్రాంతాల్లో టమోట ప్రొడక్షన్ అందుబాటులోకి రావడం చూశామని, దీంతో అనుకున్నదాని కంటే ముందుగానే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టమోట సప్లయ్ పెరుగుతోందని  పంకజాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. 

కొండ ప్రాంతాలు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పండ్ల దిగుబడి తగ్గొచ్చని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్టులు చెబుతున్నారు. పూత రాలిపోవడం, మొక్కలు చనిపోవడం లేదా గ్రోత్ సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు నెలకొంటున్నాయని వివరించారు.  ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెస్ట్  ఇండియాలలో హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఇండియా మెట్రోలాజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంచనావేస్తోంది.  సడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టెంపరేచర్స్ పెరగడం వలన బనానా సరిగ్గా డెవలప్ కావడం లేదని, రైతులకు నష్టాలు వస్తున్నాయని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు అన్నారు.