అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి... కనీస వేతనం రూ.35 వేలు ఇయ్యాలి

అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి... కనీస వేతనం రూ.35 వేలు ఇయ్యాలి
  • ధూప, దీప , నైవేద్య అర్చకుల సంఘం విజ్ఞప్తి

బషీర్​బాగ్, వెలుగు: ధూప, దీప, నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ విజ్ఞప్తి చేశారు. అర్చకుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం గత నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్చక చైతన్య యాత్ర చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా సోమవారం కాచిగూడ చౌరస్తా నుంచి అబిడ్స్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం వరకు అర్చకులు ర్యాలీ చేపట్టారు. 

అనంతరం ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్​కు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వాసుదేవ శర్మ మాట్లాడుతూ.. ధూప, దీప, నైవేద్య అర్చకులకు కనీసం రూ.10 వేలు చెల్లిస్తున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.35 వేల కనీస వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అర్చకులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేసి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్పందించాలని కోరారు.