ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

 ప్రైవేట్ ట్రావెల్స్  బస్సుకు తప్పిన పెను ప్రమాదం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్  బస్సుకు పెను ప్రమాదం తప్పింది.  ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 దగ్గర బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో బోల్తా పడింది.  ఇటుకలు తరలిస్తున్న వాహనం దాని వెనుకాలే వచ్చిన ట్రావెల్ బస్సు ..ఇటుకల వాహనాన్ని తప్పించబోయి కారును తాకుతూ డివైడర్ ను ఢీకొట్టింది. స్వల్పగాయాలతో బయటపడ్డారు ప్రయాణికులు.  స్పాట్ కు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది  ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు .