ప్రియాంక అందం చూసి అదిత్య ఠాక్రే ఎంపీ సీటు ఇచ్చారు

ప్రియాంక అందం చూసి అదిత్య ఠాక్రే ఎంపీ సీటు ఇచ్చారు

శివసేన(ఉద్ధవ్ ఠాక్రే ) వర్గానికి చెందిన  రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది అందాన్ని చూసి ఆదిత్య ఠాక్రే ఆమెను రాజ్యసభకు పంపారని ఏక్‌నాథ్ షిండే వర్గం  ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్  చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే ఈ విషయాన్ని తనతో చెప్పారని శిర్సత్ అన్నారు. అయితే సంజయ్ శిర్సత్  చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

సంజయ్ శిర్సత్ కామెంట్స్ పై  ఆదిత్య ఠాక్రే స్పందించారు.  ఇంత కుళ్లిన మనస్తత్వం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో ఎలా నిలదొక్కుకున్నారో తెలియడం లేదన్నారు.. దీనిపై ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ లో ఫైరయ్యారు.  తన ఆత్మను అమ్ముకున్న ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. రాజకీయాలు, మహిళలపై తనకున్న పాడుబుద్ధిని శిర్సత్ బయటపెట్టేసుకున్నారని అన్నారు.  కాగా ప్రియాంక చతుర్వేది 2019లో కాంగ్రెస్‌ను వీడి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరారు.