
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నడిచిన లేటెస్ట్ హాలీవుడ్ వెబ్ సిరీస్ "సిటాడెల్". ఆంథోనీ రస్సో, జో రస్సో నిర్మించిన ఈ ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ ని జోష్ అప్పెల్బామ్, బ్రయాన్ ఓహ్ మరియు డేవిడ్ వెయిల్ తెరకెక్కించగా.. రిచర్డ్ మాడెన్, స్టాన్లీ టుక్సీ, లెస్లీ మాన్విల్లే వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఏప్రిల్ 28 నుండి పప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా నిర్వహించిన గ్లోబల్ పాపులారిటీ చార్ట్‌లలో సిటాడెల్ సిరీస్ టాప్ లో నిలిచింది. ఏప్రిల్ 29న సినిమా, టీవీ ట్రాకింగ్ సైట్ "ఫ్లిక్ పెట్రోల్" విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 1125 పాయింట్స్ తో సిటాడెల్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో.. ప్రైమ్ వీడియో "ది మార్వెలస్ మిసెస్", నెట్‌ఫ్లిక్స్ "స్వీట్ టూత్ సీజన్2" నిలిచాయి. దీంతో ప్రియాంక చోప్రా ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది.