వయనాడ్: ప్రజలు తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉండాలని, అయితే ద్వేషాన్ని పెంచేలా కాకుండా శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే సృజనాత్మక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక సూచించారు.
కేరళలో మూడ్రోజుల పర్యటన సందర్భంగా శుక్రవారం ‘ది కేరళ స్టోరీ2 గోస్ బియాండ్’ సినిమాపై మీడియా అడిగిన ప్రశ్న కు ఆమె స్పందించారు. ‘‘ప్రస్తుతం సమాజంలో ద్వేషం, కోపం పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో ప్రజల్లో శాంతిని పెంపొందించే అంశాలను తెరకెక్కించాలి”అని పేర్కొన్నారు.
