వర్సిటీల్లో విద్య విధ్వంసం.. :ప్రొఫెసర్ హర గోపాల్

వర్సిటీల్లో విద్య విధ్వంసం.. :ప్రొఫెసర్ హర గోపాల్

ముషీరాబాద్, వెలుగు:  తెలంగాణ  వచ్చాక  రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్య  విధ్వంసమైందని ప్రొఫెసర్ హర గోపాల్ ఆరోపించారు.  రాష్ట్రంలోని12 వర్సిటీల్లో 1,445 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్​చేయాలని డిమాండ్​ చేశారు. స్టేట్ వర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో సామూహిక  దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎంపీ ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ప్రొఫెసర్ హర గోపాల్ హాజరై మద్దతు పలికారు. 

ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ  రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ పోవాలన్నారు. 20 ఏండ్ల నుంచి వర్సిటీల ఉన్నతికి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కృషి చేశారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పేర్కొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్​చేయవలసిన అవసరం ఉందని, ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ దీక్షలో జేఏసీ చైర్మన్ వేల్పుల కుమార్, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తాళ్లపల్లి వెంకటేశ్, ఎస్ ఎన్ అర్జున్ కుమార్, సి. విజేందర్ రెడ్డి, చీర రాజు, ఉపేందర్ రావు, భవాని, రాధిక, లక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు.