
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ ఎడిషన్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్ తడబడింది. శనివారం (సెప్టెంబర్ 13) జరిగిన మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 39–33 తో తెలుగు టీమ్‌ను ఓడించి టాప్ ప్లేస్ చేరుకుంది.
పుణెరి తరఫున ఆల్‌రౌండర్, కెప్టెన్ అస్లాం ఇనాందార్ (7 పాయింట్లు)తో పాటు డిఫెండర్లు గౌరవ్ ఖత్రి (7), విశాల్ భరద్వాజ్ (6) సత్తా చాటారు. టైటాన్స్ ఆల్ రౌండర్ భరత్ (12) సూపర్ టెన్‌తో ఆకట్టుకున్నా జట్టుకు ఓటమి తప్పలేదు.
15న జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో టైటాన్స్ పోటీ పడనుంది.