
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు ఈజీగా చిట్టీలను పొందేందుకు క్యూ ఆర్ కోడ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. మొబైల్ తో స్కాన్ చేసి, వివరాలను ఎంటర్ చేసిన తర్వాత ఓపీ కౌంటర్లకు వెళ్లి వివరాలను చూపెట్టి చిట్టి తీసుకోవాలి. దీంతో ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు క్యూ లైన్లో నిల్చొని పడే ఇబ్బందులు తప్పాయి.
అయితే.. నిరక్షరాస్యులకు ఇబ్బందిగా మారిందని మరోవైపు క్యూ ఆర్కోడ్ వివరాలతో చిట్టీ తీసుకోవడానికి కూడా క్యూ కట్టాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పేషెంట్లకు మరింత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ సీహెచ్ ఎన్. రాజకుమారి తెలిపారు.