ఆమనగల్లు, వెలుగు: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం కడ్తాల్, ఏక్వాయపల్లి, ఆమనగల్లు లలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం తలకొండపల్లి మండలం పడకల్లు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న, వరి, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

