రష్మీ గౌతమ్పై.. బేబీ ప్రొడ్యూసర్ SKN డబుల్ మీనింగ్ పంచ్లు..రష్మీ రియాక్షన్ ఏంటంటే?

రష్మీ గౌతమ్పై.. బేబీ ప్రొడ్యూసర్ SKN డబుల్ మీనింగ్ పంచ్లు..రష్మీ రియాక్షన్ ఏంటంటే?

నితిన్ కృష్ణమూర్తి(Nithin Krishnamurthy) డైరెక్షన్ లో తెరకెక్కిన యూత్ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ బాయ్స్ హాస్టల్(Boys Hostel). ఈ మూవీ  2023లో కన్నడలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్. ఇప్పుడు తెలుగులో ఆగస్టు 26న విడుదలవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌ ఈవెంట్ లో బేబీ టీం పాల్గొంది. 

బాయ్స్ హాస్టల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ రష్మీ గౌతమ్(Rashmi Gautham) పై  బేబీ(Baby)మూవీ ప్రొడ్యూసర్ SKN డబుల్ మీనింగ్ పంచ్లు వేస్తూ స్పీచ్ తో బాయ్స్ ని అలరించారు. SKN మాట్లాడుతూ..చిన్నప్పుడు గర్ల్స్ హాస్టల్లో ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకోవాలని ఉండేది. కాలేజీ హాస్టల్ బాయ్స్ రూమ్స్ లలో రష్మీ గౌతమి ఫొటోస్.. గోడకి అంటించి ఉన్నాయని కామెంట్ చేశారు.ఈ కామెంట్కి రష్మీ గౌతమి రియాక్ట్ అవుతూ..మీ ఇంట్లో ఎవరి ఫోటో ఉందంటూ..రిటర్న్ కామెంట్స్ చేసింది.దీంతో..సండే,మండే..ఇలా వీక్ మొత్తం ఒక్కో రోజు ఒక్కో ఫోటో ఉంటుందని SKN నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు. అలాగే ఇక నుంచి బేబీ వైష్ణవి(Vaishnavi) ఫొటోస్ కూడా గోడలకు చూడబోతాము అంటూ.. హాట్ స్పీచ్ తో బాయ్స్ని ఎంటర్టైన్ చేశారు. 

అలాగే బాయ్స్ హాస్టల్ లో మనకి తెలియని రహస్యాలు ఏమున్నాయో..మనకి తెలిసిన రహస్యాలు మళ్ళీ రిపీట్ ఐతే ఎలా ఉంటాయో.. అలాగే బాయ్స్ హాస్టల్లో ఎంత మంది ఆనంద్ దేవరకొండలు, విరాజ్ అశ్విన్ లు..వైష్ణవి,రష్మీ గౌతమిల కోసం ఉన్నారో అంటూ స్పీచ్ లో హీట్ పెంచేశారు ప్రొడ్యూసర్ SKN.