హైదరాబాద్,వెలుగు: రాజ్యాంగం మన జీవన విధానమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. బుధవారం మాసబ్ ట్యాంక్‌లోని కౌన్సిల్ ఆఫీసులో ‘రాజ్యాంగ దినోత్సవం’ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అనంతరం బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగ పీఠికలో ఉన్న గొప్ప విలువలని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ లో నాన్ క్రెడిట్ కోర్సుగా ‘రాజ్యాంగం’ ఉందని.. దీన్ని క్రెడిట్ కోర్సుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
