317 జీవోతో ప్రభుత్వ టీచర్లే ఎక్కువ నష్టపోయారు: ప్రొఫెసర్ కోదండరామ్

317 జీవోతో ప్రభుత్వ టీచర్లే ఎక్కువ నష్టపోయారు: ప్రొఫెసర్ కోదండరామ్

317 జీవో వల ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇబ్బంది పడింది వాస్తవమని...  జీవోతో ప్రభుత్వ టీచర్లే  ఎక్కువ శాతం నష్టపోయారన్నారు ప్రొఫెసర్ కోదండరామ్.  రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్తు సమావేశం మందిరంలో 317 జీవో  బాదిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్య సాధన అంశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చి,  అసెంబ్లీలో 317జీవో బాదితులను తమ స్వంత జిల్లాలకు పంపిస్తామని హామి ఇచ్చినందుకు కృతఙ్ఞత సభ జరిగింది.  స్థానికత మా జన్మహక్కు నినాదంతో 317 జీవో బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయ ఉద్యోగ సంగం నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని ఓడగొట్టుకోవాలి... కానీ తెగదింపులు  చేస్కోవద్దన్నారు. 317 జీవో పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వం సమస్యను విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని గుర్తించిందని చెప్పారు. జిల్లాల్లో ఉన్న మొత్తం పోస్టులకు అక్కడ కేటాయించే పోస్టులకు వ్యత్యాసం ఉందని.. ఇదే ప్రధాన సమస్య అని తెలిపారు. ఈ ఒక్క సమస్యను అధిగమిస్తే చాలా మందిని పలు చోట్ల నియమించవచ్చని ఆయన చెప్పారు. 

ఒక కొత్త జిల్లాలో అదనపు మండలాలు చేర్చడం కూడా స్థానికతకు సమస్యగా మారిందన్నారు. రెండు మండలాలు కలిపితే వచ్చినటువంటి జిల్లా నుంచి స్థానికత కల్పించడం సమస్యగా తయారైందన్నారు. అలకేషన్ సీలింగ్ అనేది తీసి వేస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. డిమాండ్ ఉన్న  తొమ్మిది జిల్లా కేంద్రాలను ప్రతి ఒక్కరు  కోరుకోవడం కూడా ప్రధాన సమస్యగా ఉందని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు.