నిబద్ధతతో పనిచేస్తేనే ఉద్యోగులకు గుర్తింపు : ప్రొఫెసర్ కోదండరాం

నిబద్ధతతో పనిచేస్తేనే  ఉద్యోగులకు గుర్తింపు : ప్రొఫెసర్ కోదండరాం
  • వార్డ్ ఆఫీసర్స్ సమ్మేళనంలో ప్రొఫెసర్​ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: విధి నిర్వహణలోప్రొఫెసర్​ కోదండరాం నిబద్ధతతో పనిచేస్తూ ఉద్యోగ జీవితంలో పురోగతి సాధించాలని ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తేనే గుర్తింపు ఉంటుందన్నారు.

అనంతరం వార్డ్ ఆఫీసర్లు రాష్ట్రస్థాయి హడక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  కమిటీ కన్వీనర్​గా ముత్యాల క్రాంతి కుమార్, కో-కన్వీనర్​గా ఎంఎస్ స్వామి, సభ్యులుగా చంద్ర కిరణ్ రెడ్డి, ప్రణయ్, శృతి, రమా, శ్రీనివాసరెడ్డి, చరణ్, శ్రీనివాసులు, నరేశ్, సురేశ్, శ్రీకాంత్, రామకృష్ణారెడ్డిలను ఎన్నుకున్నారు.  ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. వార్డ్ ఆఫీసర్లకు ఇస్తున్న పే స్కేల్​ను సవరించి జూనియర్ అసిస్టెంట్ పే స్కేలు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.