యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు మరణశిక్ష

యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు మరణశిక్ష

దేవుడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు పాకిస్థాన్ కోర్టు ఒక ప్రొఫెసర్‌కు మరణశిక్ష విధించింది. పాకిస్థాన్‌లో దేవుడిని దూషించడమనేది చాలా సున్నితమైన సమస్య. అక్కడ ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉరిశిక్షను విధిస్తారు. పాకిస్థాన్‌లో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న చాలామంది హత్యలకు గురయ్యారు.

జునైద్ హఫీజ్ అనే ప్రొఫెసర్‌ మహమ్మద్ ప్రవక్తపై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే అభియోగంతో 2013 మార్చిలో అరెస్టు చేయబడ్డారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుంది. హఫీజ్‌ను అరెస్టు చేసేనాటికి ఆయన ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సెంట్రల్ సిటీ ముల్తాన్‌ కోర్టు హఫీజ్‌కు ఈ శిక్షను విధించింది. హఫీజ్‌కు మరణశిక్ష విధించడం అత్యంత దురదృష్టకరం అని అతని తరపు న్యాయవాది అసద్ జమాల్ అన్నారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా తాము పైకోర్టులో అప్పీల్ చేస్తామని ఆయన తెలిపారు. విచారణ జరుగుతున్న సమయంలో ముల్తాన్ జైలు లోపల మరియు వెలుపల గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. హఫీజ్ కేసు విచారణలో ఉన్నప్పుడు అతని తరపున వాదించిన లాయర్ 2014లో హత్య చేయబడ్డారు. ఆ తర్వాత హఫీజ్ తరపున అసద్ జమాల్ వాదిస్తున్నారు.

హఫీజ్‌కు మరణశిక్ష విధించడంతో న్యాయవాదులు స్వీట్లు పంచుకున్నారు. దేవుడిని దూషిస్తే మరణం తప్పదని నినాదాలు చేశారు. హ్యూమన్ రైట్స్ సంఘం హఫీజ్ మరణశిక్షను తప్పుబట్టింది. ఇది తమను చాలా నిరాశపరిచిందని హక్కుల సంఘం అమ్నెస్టీ తెలిపింది. ప్రభుత్వం వెంటనే అతన్ని విడుదల చేసి, అతనిపై ఉన్న ఆరోపణలను విరమించుకోవాలని హక్కుల సంఘం ప్రతినిధి రబియా మెహమూద్ అన్నారు. అధికారులు హఫీజ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులకు మరియు అతని తరపున వాదించిన న్యాయవాదుల భద్రతకు హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌లో గతంలో దైవదూషణకు పాల్పడిన 40 మంది మరణశిక్షకు గురయ్యారని యూఎస్ కమిషన్ తెలిపింది. దైవ దూషణకు పాల్పడిందని 8 సంవత్సరాల క్రితం మరణశిక్ష విధించబడ్డ క్రైస్తవ మహిళ ఆసియా బీబీ గత అక్టోబరులో నిర్దోషిగా విడుదల చేయబడింది. ఆ సంఘటనతో అప్పట్లో పాకిస్తాన్ అంతటా హింసాత్మక నిరసనలు జరిగాయి. బీబీ ఇప్పుడు తన కుటుంబంతో కలిసి కెనడాలో నివసిస్తున్నారు.

For More News..

కాంగ్రెస్ ఎంపి శశి థరూర్‌‌కు అరెస్ట్ వారెంట్