- గేటు బయట పోస్టర్లు ఏర్పాటు
ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీ ఆవరణలో సభలు, సమావేశాలు, ధర్నాలు నిషేధమని లైబ్రరీ నిర్వాహకులు మంగళవారం పోస్టర్లు వేశారు. బతుకమ్మ పేరిట నోటిఫికేషన్ ఇవ్వాలనే పాటలు పెట్టడం, బీఎస్పీ రాష్ర్ట కో– ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పీచ్, సీఎంపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్బండి సంజయ్ విమర్శలు, సీసీఎల్ జాబ్ మేళాలో పాల్గొన్న ఎమ్మెల్సీ సురభి వాణి దేవి రాజీనామా ఎప్పుడు చేస్తారని నిరుద్యోగులు ప్రశ్నించడం, సోమవారం పీసీసీ ప్రెసిడెంట్రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా అన్నదానం చేద్దామని వస్తే లైబ్రరీ మేనేజ్మెంట్అడ్డుకోవడంతో నిరుద్యోగ జేఏసీ నేతల ఆగ్రహం, నినాదాలు వంటి ఘటనల దృష్ట్యా పోస్టర్లు వేసినట్టు తెలిపారు. సిటీ లైబ్రరీ ఆవరణలో ప్రిపేరయ్యే నిరుద్యోగులు, రీడర్స్ గమనించాలని పోస్టర్లలో సూచించారు. ఇకముందు పర్మిషన్ లేకుండా నిర్వహించి ప్రశాంత వాతావరణం చెడగొడితే వారిపై చర్యలు తీసుకుంటామని సిటీ లైబ్రరీ అధ్యక్ష కార్యదర్శి పోస్టర్లలో పేర్కొన్నారు.
