ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: తెలంగాణ ఉద్యమకారుల వేదిక విజ్ఞప్తి

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: తెలంగాణ ఉద్యమకారుల వేదిక విజ్ఞప్తి

ఉప్పల్, వెలుగు: కాంగ్రెస్ ​తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక విజ్ఞప్తి చేసింది. ఉప్పల్​చిల్కానగర్లో ఆదివారం మలిదశ ఉద్యమకారుడు నేర్ధం భాస్కర్​గౌడ్​ఆధ్వర్యంలో గజ్జల సత్యరాజ్​గౌడ్​అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, ఐడీ కార్డు, హెల్త్​కార్డు వంటి హామీలను ఇచ్చిందన్నారు. వాటిని ఇప్పటికీ  నెరవేర్చకపోవడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్​అధికారంలోకి రావడంలో ఉద్యమకారుల పాత్ర ఎంతో ఉందని తెలిపారు. కార్యక్రమంలో గోపు సదానంద్, అంబటి జగదీశ్, చీమ శ్రీనివాస్, తెలంగాణ సంపత్​ తదితరులు పాల్గొన్నారు.