జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లు మందగించడంపై పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ సీరియస్గా తీసుకుంది. ఈ క్రమం లో హైదరాబాద్ హెడ్డాఫీస్ నుంచి నోడల్ అధికారి శ్రీధర్ జగిత్యాలలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలైన కోరుట్లలో 84.04శాతం, మెట్‌పల్లిలో 70శాతం, ధర్మపురిలో 32.37 శాతం, రాయికల్‌లో 66.42శాతం పన్నులు వసూలు కాగా.. గ్రేడ్ 1 మున్సిపాలిటీ జగిత్యాలలో 40.20 శాతం మాత్రమే వసూలు కావడంపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
కాగా బిల్లింగ్ మిషన్లు పని చేయకపోవడం వల్లే వసూళ్ల లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వార్డు అధికారులు చెబుతుండగా, మిషన్లు సక్రమంగానే ఉన్నాయని బల్దియా రెవెన్యూ అధికారులు పేర్కొనడం అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతోంది.
