సాయం చేయాలని టవర్​ ఎక్కి నిరసన

సాయం చేయాలని టవర్​ ఎక్కి నిరసన

ఎల్ బీనగర్, వెలుగు: సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఎల్​బీనగర్​ చింతలకుంటలో ఓ వ్యక్తి రేడియో టవర్​ఎక్కి నిరసన తెలిపాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడ అధికారినగర్ కు చెందిన బొల్లెద్దుల నర్సింగ్​రావు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. కాలనీలోని రేకుల షెడ్లలో ఉంటున్న 45 కుటుంబాలు వర్షం కురిసిన ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నాయని, జాగా ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి సాయం చేయాలని సీఎం కేసీఆర్, గవర్నర్, జిల్లా కలెక్టర్​కు నర్సింగ్​ గతంలో వినతిపత్రాలు ఇచ్చాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం అంబేద్కర్ ​జయంతి సందర్భంగా టవర్​ ఎక్కి నిరసనకు దిగాడు. కందుకూరు ఆర్డీవో సూరజ్ కుమార్ 

అక్కడికి వచ్చి నర్సింగ్ రావుతో 

ఫోన్​లో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అతడు కిందికి దిగాడు. నర్సింగ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. 2018లో నాగర్ కర్నూల్ సభలో సీఎం కేసీఆర్ జాగా ఉన్నోళ్లకు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించాడు.   ఇప్పటికైనా ఇల్లు కట్టుకునేందుకు తనకు సాయం చేయాలని కోరాడు.