
పద్మారావునగర్, వెలుగు : కోల్ కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనను నిరసిస్తూ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు గురువారం కూడా నిరసన కొనసాగించారు. సాయంత్రం జోరుగా కురుస్తున్న వర్షంలోనూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వర్షంలో తడుస్తూనే గాంధీ ఆసుపత్రి ఆవరణతోపాటు పద్మారావు నగర్ కాలనీలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్యాండిల్స్ వెలిగించి బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.