సీఎం పర్యటనలో నిరసన తెలపండి : పొన్నం ప్రభాకర్​

సీఎం పర్యటనలో నిరసన తెలపండి : పొన్నం ప్రభాకర్​

వేములవాడ/జగిత్యాల, వెలుగు: జిల్లాకు కేసీఆర్​పలు హామీలు ఇచ్చి మరిచాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​అన్నారు. జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా అడుగడుగునా నిరసన తెలపాలని కాంగ్రెస్​ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్​తో కలిసి పొన్నం మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2014 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన హామీలను విస్మరించినందున సీఎం సభలో నిరసన వ్యక్తం చేయాలన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ. 100 కోట్లు కేటాయిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. బ్రాహ్మణ సంఘం నాయకులు, భక్తులు --రాజకీయంగా కాకుండా స్వామివారి భక్తులుగా రాజన్న ఆలయ అభివృద్ధిపై నిలదీయాలన్నారు. మిడ్​మానేరు --ముంపు గ్రామాల సమస్యలు ఇప్పటికీ పరిష్కరించలేదని, అడిగితే అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. 

రోడ్డు పనులు శిలాఫలకానికే పరిమితం

మేడిపల్లి మండలం మోత్కురావుపేట, చందుర్తి రోడ్డు పనులు ఐదేండ్లుగా శిలాఫలకానికే పరిమితం కావడాన్ని నిరసిస్తూ భీమారం మండల కేంద్రం నుంచి మోత్కురావుపేటలోని శిలాఫలకం వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రోడ్డు పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాకపోవడం  ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. కలిగోట - సూరమ్మ ప్రాజెక్టు పనులు సైతం తొమ్మిదేళ్లు గడుస్తున్నా పూర్తికాలేదన్నారు. ఎమ్మెల్యే రమేశ్​బాబు అసమర్థత  వల్లే అభివృద్ధి పనులు జరగడంలేదని విమర్శించారు. తక్షణం రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 

మిత్తీ మీదపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం 

ఏయేడుకాయేడు బతుకమ్మ చీరలకు సంబంధించిన బడ్జెట్ విడుదల చేయాలి. చిన్నతరహా యజమానులు అప్పులు తెచ్చి చీరలు ఉత్పత్తి చేస్తున్నారు. మాలాంటి పాలిస్టర్ సంఘాలు కూడా లోన్లు తెచ్చి యార్న్​ కొనుగోలు చేస్తాయి.  ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల మిత్తీ మీద పడి నష్టాల పాలవుతున్నాం. బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి.

– మండల సత్యం, సిరిసిల్ల పాలిస్టర్ పవర్​లూమ్​ వస్ర్త ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు

ప్రభుత్వానికి నివేదించాం

బతుకమ్మ చీరలు, ఇతర ఉత్పత్తికి సంబంధించిన బకాయిల లెక్కలు ప్రభుత్వానికి నివేదించాం. ఇప్పటికే బతుకమ్మ చీరలకు సంబంధించి రూ. 50 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి. త్వరలోనే  నేతన్నల ఖాతాలలో వేస్తాం. మిగతా బకాయిలు ప్రభుత్వం రిలీజ్ చేయగానే ఉత్పత్తిదారుల ఖాతాలకు ట్రాన్స్​ఫర్ చేస్తాం.

– సాగర్, చేనేత జౌళిశాఖ ఏడీ