రేపు MGBS దగ్గర మహిళా కార్మికులతో నిరసన

రేపు MGBS దగ్గర మహిళా కార్మికులతో నిరసన

ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు ఆర్టీసీ జేఏసీ అశ్వత్ధామరెడ్డి. ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆపేది లేదని… రేపు(ఆదివారం) MGBS దగ్గర మహిళా కార్మికులతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. నగరంలోని మహిళా కార్మికులంతా భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మానవ హారాలుగా ఏర్పడి నిరసన తెలపాలన్నారు.

ప్రభుత్వం స్పందించే వరకు తాము నిరసన చేపడుతామన్నారు అశ్వత్ధామరెడ్డి. షరతుల్లేకుండా ఉద్యోగాల్లోకి తీసుకుంటే తాము చేరేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్ దీనిపై సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆదివారం మరోసారి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు అశ్వత్ధామరెడ్డి.